అందంతో గులాబీ జత కడితే ఈ వయ్యారి రూపం..
TV9 Telugu
31 May 2024
5 డిసెంబర్ 1992న దేశ రాజధాని ఢిల్లీలో విమల్ కుమార్ రాజ్ పుత్, నిర్మల్ రాజ్ పుత్ దంపతులకు జన్మించింది పాయల్ రాజ్ పుత్.
తన తల్లిదండ్రులతో కలిసి ముంబైలో నివసిస్తున్న ఈ బ్యూటీకి చిన్నతనం నుంచే నటన పై ఆశక్తితో గ్రాడ్యుయేషన్ తర్వాత చిత్రసీమలో అడుగుపెట్టింది.
2010లో సప్నోన్ సే భరే నైనా అనే ఓ హిందీ సీరియల్ లో సోనాక్షిగా టెలివిజన్ లో తన కెరీర్ని ప్రారంభించింది.
ఆఖిర్ బహు భీ తో బేటీ హీ హై సీరియల్ లో సియా అనే ప్రధాన పాత్రను పోషించింది. గుస్తాఖ్ దిల్, మహాకుంభ్: ఏక్ రహస్యా, ఏక్ కహానీ సీరియల్స్ లో నటించింది.
2017లో చన్నా మేరేయా అనే ఓ పంజాబి చిత్రంలో కథానాయకిగా ప్రధాన పాత్రలో సీని అరంగేట్రం చేసింది ఈ వయ్యారి భామ.
2018లో వీరే కి వెడ్డింగ్ అనే ఓ హిందీ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయింది ఈ భామ.
తర్వాత 2018లో ఆర్ఎక్స్100 అనే చిత్రంలో యంగ్ హీరో కార్తికేయకి జోడిగా తెలుగు చిత్రం పరిశ్రమలో అడుగుపెట్టింది ఈ బ్యూటీ.
తర్వాత వెంకటేష్ సరసన వెంకీ మామ సినిమాలో కథానాయకిగా నటించింది. 2023లో వచ్చిన మంగళవారం అనే చిత్రంతో ఆకట్టుకుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి