ట్రెడిషనల్ లుక్ లో టెంప్ట్ చేస్తున్న పాయల్ రాజ్ పుత్

19 August 2025

Phani Ch

5 డిసెంబర్ 1992న దేశ రాజధాని ఢిల్లీలో విమల్ కుమార్ రాజ్ పుత్, నిర్మల్ రాజ్ పుత్ దంపతులకు జన్మించింది పాయల్ రాజ్ పుత్.

చిన్నతనం నుంచే నటనపై ఆశక్తితో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన తర్వాత చిత్రసీమలో అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ.

2010లో సప్నోన్ సే భరే నైనా అనే ఓ హిందీ సీరియల్‎లో సోనాక్షి అనే పాత్రతో టెలివిజన్‎లో తన కెరీర్‌ని ప్రారంభించింది.

ఆఖిర్ బహు భీ తో బేటీ హీ హై సీరియల్ లో సియా అనే ప్రధాన పాత్రను పోషించింది. గుస్తాఖ్ దిల్‌, మహాకుంభ్: ఏక్ రహస్యా, ఏక్ కహానీ సీరియల్స్ లో నటించింది.

2017లో చన్నా మేరేయా అనే ఓ పంజాబి చిత్రంతో అరంగేట్రం చేసింది. 2018లో వీరే కి వెడ్డింగ్ అనే ఓ హిందీ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయింది.

తర్వాత 2018లో ఆర్ఎక్స్100 అనే చిత్రంలో యంగ్ హీరో కార్తికేయకి జోడిగా తెలుగు చిత్రం పరిశ్రమలో అడుగుపెట్టింది ఈ బ్యూటీ.

తర్వాత వెంకటేష్ సరసన వెంకీ మామ సినిమాలో కథానాయకిగా నటించింది. 2023లో మంగళవారం చిత్రంతో ఆకట్టుకుంది ఈ బ్యూటీ.