ఆ అందం కూడా ఈమెను దేవతగా భావించి పూజలు చేస్తుందేమో..

10 November 2023

5 డిసెంబర్ 1992న దేశ రాజధాని ఢిల్లీలో విమల్ కుమార్ రాజ్ పుత్, నిర్మల్ రాజ్ పుత్ దంపతులకు జన్మించింది పాయల్ రాజ్ పుత్.

తన తల్లిదండ్రులతో కలిసి ముంబైలో నివసిస్తున్న ఈ బ్యూటీకి చిన్నతనం నుంచే నటన పై ఆశక్తితో గ్రాడ్యుయేషన్ తర్వాత చిత్రసీమలో అడుగుపెట్టింది.

2010లో సప్నోన్ సే భరే నైనా అనే ఓ హిందీ సీరియల్ లో సోనాక్షిగా టెలివిజన్ లో తన కెరీర్‌ని ప్రారంభించింది.

ఆఖిర్ బహు భీ తో బేటీ హీ హై సీరియల్ లో సియా అనే ప్రధాన పాత్రను పోషించింది. గుస్తాఖ్ దిల్‌, మహాకుంభ్: ఏక్ రహస్యా, ఏక్ కహానీ సీరియల్స్ లో నటించింది.

2017లో చన్నా మేరేయా అనే ఓ పంజాబి చిత్రంలో కథానాయకిగా ప్రధాన పాత్రలో సీని అరంగేట్రం చేసింది ఈ వయ్యారి భామ.

2018లో వీరే కి వెడ్డింగ్ అనే ఓ హిందీ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయింది ఈ భామ.

తర్వాత 2018లో ఆర్ఎక్స్100 అనే చిత్రంలో యంగ్ హీరో కార్తికేయకి జోడిగా తెలుగు చిత్రం పరిశ్రమలో అడుగుపెట్టింది ఈ బ్యూటీ.

తెలుగులో ఆర్ఎక్స్100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో మంగళవారం అనే చిత్రంతో నవంబర్ 17న ప్రేక్షకులను అలరించనుంది.