ఓ సినిమా క్రేజ్ ఏంటో తెలుసుకోవాలంటే.. ఏం చేయాలి. అయితే సోషల్ మీడియా ట్రెండింగ్ లిస్టు చూడాలి. లేదంటే.. ఓవర్స్ సీస్ బిజినెస్ వైపు ఓ లుక్కేయాలి.
అప్పుడే ఆ సినిమా సెట్ చేయబోయే రికార్డ్ లెవల్ ఏంటో అందరికీ క్లియర్ కట్ గా తెలుస్తుంది. ఇది అందరికి తెలిసిందే.
పవన్స్ ఓజీ చేయబోయే విస్పోటం తాలూకు హింట్ కూడా.. వీటినుంచే బయటికి వచ్చి నెట్టింట హంగామా చేస్తోంది.
ఎస్ ! సుజీత్ డైరెక్షన్లో.. పవన్ చేస్తున్న మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ ఓజీ! రీసెంట్ గా పవన్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ అయిన ఓజీ టీజర్.
ఓ రేంజ్‌లో నెట్టింట ట్రెండ్ అయిన ఈ సినిమా.. ఇప్పుడు ఓవర్సీస్ గడ్డపై తన హవా చూపిస్తోంది. హాలీవుడ్‌లోనూ ఓజీ మేనియా టాప్ రేంజ్‌లో వైరల్ అవుతోంది.
ఎస్! ఇంకా రిలీజ్ డేటే బయటికి రానీ పవన్ ఓజీ సినిమా ఓవర్ సీస్ రైట్స్‌ను Phars Films దాదాపు 13 కోట్లకు కొనుగోలు చేసిందట.
తొందర్లో ఇదే విషయంగా అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా చేయనుందట. ఇక ఈ న్యూస్ అన్ అఫీషియల్ గా బయటికి రావడంతో.. ఓవర్సీస్ లో పవన్ ఓజీకున్న క్రేజ్ అందరికీ తెలిసేలా చేస్తోంది.
పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక మోహన్ ఈ చిత్రంలో కథానాయకిగా నటిస్తుంది. థమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.