TV9 Telugu

ఎస్.! ఓజి వచ్చేస్తున్నాడు.! ఎప్పుడో మరోసారి క్లారిటీ ఇచ్చిన నిర్మాత.

08 April 2024

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గ్యాంగ్ స్టర్ డ్రామా ఓజి.

ఈ సినిమా సెప్టెంబర్ 27 న సినిమా విడుదల అవుతుందని ఇప్పటికే ఈ మూవీ మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే..

అయితే గత కొన్ని రోజులుగా ఈ మూవీ షూటింగ్ పవన్ పాల్గొనకపోవడంతో ఈ మూవీ వాయిదా పడతుంది అనే టాక్ వినిపిస్తుంది.

ఎలక్షన్స్ కారణంగా పవర్ స్టార్ రాజకీయాల్లో బిజీ బిజీగా గడపడంతో సినిమా షూటింగ్ లకు కాస్త విరామం ఇచ్చారు అని..

ఆ కారణాల వల్ల పవన్ ఓజి సినిమా రిలీజ్ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి అని ఇండస్ట్రీ లో వార్తలు వినిపించాయి.

ఇక తాజాగా ఓజి నిర్మాత డీవీవీ దానయ్య మరోసారి మాట్లాడుతూ ఈ సినిమా రిలీజ్ డేట్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు.

పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఓజి సినిమా సెప్టెంబర్ 27న మీ ముందుకు వస్తుందంటూ మరోసారి క్లారిటీ ఇచ్చారు.

ఇందులో కొందరు బాలీవుడ్ యాక్టర్స్ తో పాటు హీరోయిన్ గా ప్రియాంకా అరుళ్ మోహన్ నటిస్తున్న విషయం తెలిసిందే.