‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రం కోసం మొదటిగా ఆ హీరోని అనుకున్నారట..

27 September 2023

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వెంకటేశ్‌, మహేశ్‌బాబు హీరోలుగా నటించిన మల్టి స్టారర్ చిత్రం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’.

2013లో వచ్చిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ మూవీలో అంజలి, సమంత హీరోయిన్లుగా ఆకట్టుకున్నారు.

ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, జయసుధ, తనికెళ్ళ భరణి, రావు రమేష్, రవి బాబు కీలక పాత్రల్లో నటించారు. మురళి మోహన్ అతిధి పాత్రలో కనిపించరు.

ఈ చిత్రంలో సీత పాత్రలో అంజలి జీవించింది. తాజాగా ఈ చిత్రం గురించి గుర్తు చేసుకున్న దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల.

కుటుంబ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ చిత్రంలో వెంకటేశ్‌, మహేశ్‌బాబు పెద్దోడు, చిన్నోడు పాత్రల్లో మెప్పించారు.

తాజాగా ‘పెదకాపు-1’ ప్రమోషన్స్ లో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రం గురించి కొన్ని విషయాలు పంచుకున్నారు డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల.

ఈ సినిమాలో పెద్దోడు పాత్ర కోసం ముందుగా పవన్‌కల్యాణ్‌ని అనుకున్నామని.. కొన్ని అది కుదరకపోయడంతో వెంకటేష్ ని పెట్టినట్టు తెలిపారు.

కాగా నారప్ప చిత్రం నుంచి స్టైల్ మార్చిన శ్రీకాంత అడ్డాల.. ఈ నెల 29న ‘పెదకాపు-1’ చిత్రంతో ప్రేక్షకులను మెప్పించనున్నారు.