హరీష్ శంకర్ బాధ భరించలేక..! పవన్
TV9 Telugu
21 March 2024
ఉస్తాద్ భగత్‌సింగ్ నుంచి డైలాగ్ ప్రోమో చూశారా? పవర్‌స్టార్ గ్లాసు గురించి చెప్పిన మాటలు నచ్చాయా?
పవన్ ఫ్యాన్స్ కి నచ్చకుండా ఎందుకుంటాయి అంటారా? అది ఓకే... కాకపోతే మన పవర్‌స్టార్‌కే పెద్దగా నచ్చలేదట.
నచ్చనిది డైలాగ్ అయితే కాదు.. సిల్వర్‌స్క్రీన్ మీద అలాంటి డైలాగులు చెప్పడం... అని అంటున్నారు జనసేనాని.
హరీష్‌శంకర్ బాధపడలేకే ఈ డైలాగ్ చెప్పాల్సి వచ్చిందన్నది టాలీవుడ్ పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ చెబుతున్న మాట.
అందరూ పవన్ కల్యాణ్ ఓడిపోయారని అంటుంటే నచ్చలేదట ఉస్తాద్ భగత్ సింగ్ సినెమా దర్శకుడు హరీష్ శంకర్‌కి.
అలాంటి వాళ్లందరికీ తాను చెప్పాలనుకున్న విషయాన్ని ఈ డైలాగ్ త్రూ చెప్పారట ప్రముఖ డైరెక్టర్ హరీష్ శంకర్.
గాజు పగిలేకొద్దీ పదునెక్కిద్ది అని హరీష్ రాసిన మాటను వైరల్ చేస్తున్నారు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్.
గబ్బర్‌సింగ్ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్నారు పవన్ కల్యాణ్. ఏపీ ఎన్నికల తర్వాత ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమా షూటింగ్ ఊపందుకుంటుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి