హోం కాదు.. నాకు ఈ శాఖలపైనే ఆసక్తి: పవన్ కల్యాణ్

TV9 Telugu

06 June 2024

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. మొత్తం 164 స్థానాల్లో గెలుపొందింది.

దీంతో ఈనెల 12న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ఇక ఈ కూటమిలో భాగమైన జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలకే కూడా క్యాబినేట్ పదవులు దక్కవచ్చునని తెలుస్తోంది.

ముఖ్యంగా జనసేన అధిపతి పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం కావచ్చునని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

అదే సమయంలో హోం శాఖ బాధ్యతలను పవన్ కల్యాణ్ కు కట్ట బెట్టవచ్చనే రూమర్లు వినిపిస్తున్నాయి.

తాజాగా ఈ శాఖల కేటాయింపుపై పై స్పందించిన జనసేన అధిపతి పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తనకు పర్యావరణ కాలుష్య నివారణపై పని చేయాలని ఉందని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు పవన్ కల్యాణ్.

అలాగే  వ్యవసాయం, రైతులకు సహకరించే ఇరిగేషన్ వంటి శాఖలపై ఆసక్తి ఉందని మనసులో మాట బయటపెట్టారు పవన్.