ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా తెరిచిన పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్.. ఇది కేవలం పేరు మాత్రమే కాదు. పవర్. ఆయన పిలుపు ప్రభంజనం.

హీరోగా ప్రేక్షకాభిమానులనే అలరించడమే కాకుండా రాజకీయ నాయకుడిగా అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ప్రజల్ని చైతన్య పరుస్తున్నారు.

షూటింగ్స్ నుండి కాస్త బ్రేక్ తీసుకుని ఇటీవల వారాహి యాత్ర ప్రారంభించి ఇతర హీరోల అభిమానుల నుండి కూడా భారీ మద్దతు లభిస్తుంది.

ఇదిలా ఉంటే పవర్ స్టార్ రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేశారు.

ఇప్పటికే ట్విట్టర్, ఫేస్‌బుక్‌లో యాక్టివ్‌గా ఉన్న జనసేనాని ఇప్పుడు ఇన్‌స్టాలోకి ఎంట్రీ ఇచ్చారు.

ఆయన ప్రొఫైల్‌లో ఇతర అకౌంట్ల మాదిరిగానే ‘ఎలుగెత్తు, ఎదురించు, ఎన్నుకో..Jai Hind!’ అనే క్యాప్షన్ పెట్టారు.

ఎలాంటి పోస్టులైతే చేయలేదు కానీ జూన్ నెలలో జాయిన్ అయినట్లు జూలైలో అకౌంట్ వెరిఫై అయినట్లు తెలుస్తుంది

అలాగే గత 90 రోజుల్లో యూజర్ నేమ్ ఒక్కసారి మార్చినట్లు చూపిస్తుంది.