TV9 Telugu
ఓజిపై ప్రియాంక కామెంట్స్.. షార్ట్ రన్ టైమ్‌తో టిల్లు స్క్వేర్..
27 Febraury 2024
పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ తెరకెక్కిస్తున్న ఓజి సినిమాపై హీరోయిన్ ప్రియాంక మోహన్ కీలక విషయాలు తెలిపింది.
ఈ సినిమా చాలా బాగా వస్తుందని.. ఆ మ్యాజిక్ స్క్రీన్‌పై చూస్తారని చెప్పుకొచ్చింది హీరోయిన్ ప్రియాంక మోహన్.
ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని తెలిపింది ఈ భామ. పవన్ కళ్యాణ్‌తో నటించే అవకాశం రావడం అదృష్టం అంది.
అతను ఒక లెజెండ్, అమేజింగ్ హ్యుమన్ అంటూ పవన్ కళ్యాణ్ ని పొగిడింది ప్రియాంక మోహన్. ఇది చూసిన ఫ్యాన్స్ ఖుషి అయ్యారు.
డీజే టిల్లు సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్న సిద్ధూ జొన్నలగడ్డ త్వరలో టిల్లు స్క్వేర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు.
షార్ట్ రన్ టైమ్‌తో థియేటర్ల ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ రొమాంటిక్ క్రైమ్ కామెడీ మూవీ.
మార్చి 29న విడుదలవుతున్న ఈ సినిమా నిడివి రెండు గంటల ఒక్క నిమిషం మాత్రమే అని వెల్లడించారు మూవీ మేకర్స్.
అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు మల్లిక్ రామ్ దర్శకుడు. సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మాతలు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి