పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి దసరా అదరహో..
25 October 2023
దసరా వేళ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులను ఖుషి చేశారు ఉస్తాద్ భగత్ సింగ్, ఓజి చిత్రాల మూవీ మేకర్స్.
ఈ రెండు చిత్రాల నుంచి మాస్ లుక్స్ విడుదల చేశారు మేకర్స్. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు మంచి జోష్ లో ఉన్నారు.
పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్.
తాజాగా మంగళవారం దసరా పండగ సందర్భంగా ‘‘విధ్వంస ఆయుధం’’ అంటూ పవన్ పోలీస్ డ్రస్ లో భోజంపై సమ్మెటతో మాస్ లుక్ లుక్ ను విడుదల చేశారు.
మాస్ ఎనర్జిటిక్ ఎంటర్‌టైనర్ అని, కుటుంబ ప్రేక్షకులకు యువతరానికి కూడా నచ్చేలా ఉంటుందని, త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తామని ట్వీట్ చేశారు హరీష్.
సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరో రూపొందుతున్న గ్యాంగ్ స్టార్ డ్రామా చిత్రం ఓజి. ప్రియాంక మోహన్ కథానాయక.
మంగళవారం దసరా పండగ పురస్కరించుకొని ఈ సినిమా నుంచి విడుదల చేసిన పోస్టర్ లో కత్తిలాంటి కళ్లతో పవన్ ఆకట్టుకున్నారు.
ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదలైన హంగ్రీ చీతా వీడియోతో మూవీపై అంచనాలు అమాంతం పెరిపోయాయి. ఈ చిత్రం దాదాపుగా చివరి దశకు వచ్చేసింది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి