పవన్ ఫస్ట్ మూవీ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? మరీ అంత తక్కువా?
04 September 2024
Basha Shek
మెగాస్టార్ చిరంజీవి వారసత్వం తీసుకుని సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు పవన్ కల్యాణ్. తన సొంత ఇమేజ్ తో పవర్ స్టార్ గా ఎదిగాడు.
సినిమాలు చేసినా, చేయకపోయినా పవన్ కల్యాణ్ కు ఉన్న క్రేజ్ ఇసుమంతైనా తగ్గలేదు. పైగా రోజురోజుకు ఆయన ఫాలోయింగ్ పెరుగుతోంది.
సినిమాల్లో పవర్ స్టార్ గా ఎదిగిన పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా అక్కడి ప్రజలకు తన వంతు సేవలు అందిస్తున్నారు.
ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలో ఉన్న పవన్ కల్యాణ్ త్వరలో తన పెండింగ్ సినిమాలు కూడా కంప్లీట్ చేసే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది
టాలీవుడ్ లో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోలలో పవన్ కల్యాణ్ కూడా ఒకరు. పాన్ ఇండియా హీరోలను మించి ఆయన రెమ్యునరేషన్ అందుకుంటున్నారు.
ప్రస్తుతం సినిమాకు 50 కోట్లకు పైగా పారితోషికం అందుకున్న పవన్ కల్యాణ్, కెరీర్ ప్రారంభంలో మాత్రం చాలా తక్కువ రెమ్యూనరేషన్ అందుకున్నారట.
అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాకు పవన్ న్ నెలవారీ జీతం ఎంత అందుకున్నాడో తెలుసా? అక్షరాలా 5 వేలట.
అలా షూటింగ్ మొత్తం పూర్తి అయ్యే సరికి పవన్ కల్యాణ్ కు కేవలం 50 వేల వరకు మాత్రమే వచ్చాయట. షాకింగ్ గా ఉంది కదా..
ఇక్కడ క్లిక్ చేయండి..