మెప్పు పొందుతుంది: పవన్‌కల్యాణ్‌.. తలైవర్‌ 171 కహానీ..

TV9 Telugu

03 April 2024

గబ్బర్ సింగ్, డీజే లాంటి చిత్రాలతో అందరినీ మెప్పించిన హరీష్ శంకర్ కి ప్రేక్షకుల నాడి తెలుసు అని అన్నారు పవన్‌కల్యాణ్‌.

హరీష్ తెరకెక్కించిన ప్రతి సినిమా సన్నివేశాల్లో, సంభాషణల్లో ఆయన శైలి కనిపిస్తుందని చెప్పారు జనసేనాని.

గబ్బర్ సింగ్ కాంబినేషన్లో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ ప్రేక్షకుల మెప్పు పొందుతుందని అన్నారు పవర్ స్టార్.

హరీష్‌ శంకర్‌ పుట్టినరోజు సందర్భంగా పవన్‌ ఇచ్చిన కాంప్లిమెంట్స్ సోషల్ మీడియా వేదికగా వైరల్‌ అవుతున్నాయి.

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా స్టార్ దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది.

భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా బంగారం స్మగ్లింగ్‌ నేపథ్యంలో ఉంటుందని కోలీవుడ్ సినీ వర్గాల టాక్‌.

పలు దేశాల నుంచి బంగారాన్ని స్మగ్లింగ్‌ చేసే డాన్‌గా కనిపిస్తారట కోలీవుడ్ సీనియర్ స్టార్ హీరో రజనీకాంత్‌.

ఇటీవల విడుదల చేసిన హీరో ఫస్ట్ లుక్‌లో కూడా బంగారానికి కొంత ఇంపార్టెన్స్ ఇచ్చారు తలైవర్ 171 మూవీ మేకర్స్.