TV9 Telugu
మార్కెట్ మహాలక్ష్మి టీజర్.. రాయన్ క్రేజీ అప్డేట్..
26 Febraury 2024
రొమాంటిక్ కామెడీ చిత్రం కేరింత మూవీ ఫేమ్ పార్వతీశం, ప్రణీకాన్వికా జంటగా నటిస్తున్న సినిమా మార్కెట్ మహాలక్ష్మి.
వియస్ ముఖేష్ అనే వ్యక్త మార్కెట్ మహాలక్ష్మి సినిమాతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమకి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
తాజాగా మార్కెట్ మహాలక్ష్మి టీజర్‌ను ప్రముఖ హీరో శ్రీవిష్ణు విడుదల చేసారు. టీజర్ అంతా ఆసక్తికరంగా సాగింది.
ఓ సాఫ్ట్‌వేర్ అబ్బాయి కూరగాయలమ్మే అమ్మాయిని ప్రేమించి, ఆమె ప్రేమని ఎలా పొందాడనే కథాంశంతో ఈ సినిమా వస్తుంది.
కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా నటిస్తున్న 50వ సినిమా రాయన్. ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాకు దర్శకుడు కూడా ఆయనే.
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. గతంలో కెప్టెన్ మిల్లర్ లో వీరు కలిసి నటించారు.
తాజాగా ఈ సినిమాలోని మరో కీలక పాత్రను పరిచయం చేశారు ధనుష్. ఆ పాత్రలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ నటిస్తున్నారు.
తాజాగా ఈ పాత్ర ఫస్ట్ లుక్ విడుదల చేశారు దర్శక నిర్మాతలు. సినిమా 2024లోనే విడుదల కానుందని తెలిపారు ధనుష్.
ఇక్కడ క్లిక్ చెయ్యండి