TV9 Telugu
చెప్పుడు మాటలు విని తప్పులు చేశాను.. పరిణితి చోప్రా వైరల్ కామెంట్స్.
23 April 2024
బాలీవుడ్ రీమేక్ అమర్ సింగ్ చమ్కిలా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా.
బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నప్పటికి సరైన హిట్ మాత్రం అందుకోలేక పోయింది ఈ ముద్దుగుమ్మ.
ఈ సినిమా కోసం పరిణితి తన బరువు 15 కిలోలు పెంచుకుంది. తాజాగా ఆమె మాట్లాడుతూ.. ఆసక్తికర విషయాలను పంచుకుంది.
"చాలా మంది నాకు తప్పుడు సలహాలు ఇచ్చారు. అవి విన్నాక, అప్పట్లో నాకు కరెక్ట్ అనిపించి చాలా సినిమాలు చేశాను.
ఆ సమయంలో తనకు ఇండస్ట్రీ గురించి పెద్దగా అవగాహన లేదని.. దీంతో కెరీర్‌లో ఎన్నో పొరపాట్లు దొర్లాయి అని..
నేడు వాటి ఫలితాన్ని చవిచూస్తున్నా.. చెప్పుడు మాటలు విని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా అని అంటుంది పరిణితి.
తర్వాత ఏం చేయాలో ఇప్పుడు అర్థమైందని, ఇప్పుడు నాకు పని ఇచ్చే దర్శక నిర్మాతలు కావాలి తెలిపింది పరిణీతి చోప్రా.
అదే సమయంలో తన తప్పులను చూసి కాకుండా తన ప్రతిభను చూసి మాత్రమే మళ్లీ సినిమా అవకాశాలు ఇవ్వాలని అంటుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి