'ఆ స్టార్ హీరో ప్యాంట్ వేసుకోకుండా వచ్చి పక్కన కూర్చుంటాడు'

TV9 Telugu

25 May 2024

ప్రియాంకా చోప్రా సోదరి ట్యాగ్ తో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది పరిణీతి చోప్రా.

గతేడాది ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాతో కలిసి పెళ్లిపీటలెక్కిన ఈ ముద్దుగమ్మ మళ్లీ ఇప్పుడిప్పుడే సినిమా షూటింగులతో బిజీబిజీగా ఉంటోంది.

కాగా బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో పరిణీతి చోప్రాకు ఉన్న క్లోజ్ ఫ్రెండ్స్ లో స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ కూడా ఒకరు.

 ‘లేడీస్ వర్సెస్ రిక్కీ బాహ్ల్’ సినిమాలో మొదటిసారిగా కలిసి నటించారు పరిణీతి చోప్రా, రణ్ వీర్ సింగ్. ఈ మూవీతోనే వీరి స్నేహం మొదలైంది.

ఇదిలా ఉంటే రణ్ వీర్ సింగ్ గురించి గతంలో పరిణీతి చోప్రా మాట్లాడిన వ్యాఖ్యలకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతోంది.

రణవీర్‌తో మనం ఎలాగైనా ఉండొచ్చని, కానీ తను ప్యాంట్ వేసుకోకుండా వచ్చి పక్కన కూర్చుంటాడని పరిణీతి చోప్రా చెప్పుకొచ్చింది.

మేకప్ రూమ్‌ లో రణ్‌వీర్ ఎలా ఉంటాడో తెలియదని, అందుకే పర్మిషన్ లేకుండా అతని దగ్గరికి వెళ్లనని తెలిపిందీ అందాల తార.

'రణ్ వీర్ బట్టలు లేకుండా చూస్తే తనేం ఫీల్ అవ్వడు. కానీ మనం ఫీల్ అవ్వాల్సి వస్తుంది' అంటూ హీరోతో తనకున్న ఫ్రెండ్ షిప్ గురించి చెప్పుకొచ్చింది పరిణీతి.