“సలార్ 2” లో ప్రభాస్ భారీ డైలాగ్.. వింటే గూస్‌బంప్స్ రావాల్సిందే

Phani.ch

13 May 2024

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన  స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సలార్. ఈ సినిమా ఎంత హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

సాలార్ సినిమా సూపర్ హిట్ అయ్యి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టి, సెన్సేషన్ క్రియేట్ చేయడం జరిగింది.

ఇది ఇలా ఉంటే సాలార్ చిత్రం సెకండ్ పార్ట్ ఎలా ఉండబోతుంది అని ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే సలార్ మొదటి పార్ట్ లో ప్రభాస్ కి ఎక్కువగా డైలాగ్స్ లేవు. అవి ఫ్యాన్స్ ను కాసింత నిరాశకి గురి చేశాయి అనే చెప్పాలి.

దీనిని దృష్టిలో ఉంచుకుని దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రభాస్ కోసం కొన్ని పవర్ ఫుల్ డైలాగ్స్ ను పార్ట్ 2 లో జోడించాడట.

సలార్ 2లో ప్రభాస్ కు ఓకే భారీ డైలాగ్ ఉందని, ఇది ఫ్యాన్స్ కి మాంచి కిక్ ఇస్తుంది సినీ వర్గాలు అందిస్తున్న సమాచారం.

పృథ్వీరాజ్ సుకుమారన్ మెయిన్ విలన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. మరో రెండు నెలల్లో సలార్ 2ని సెట్స్ పైకి తీసుకు వెళుతోంది.