పాపం.. పులిహోర బిడ్డ, గాలిగట్టిగానే తీశారుగా..!

13 September 2023

పల్లవి ప్రశాంత్‌! రైతు బిడ్డగా.. తన రీల్స్‌తో.. ఇంస్టాగ్రామ్, యూట్యూబ్ పోస్టులతో చాలా పాపులర్ అయ్యారు.

బిగ్ బాస్ 7 లోకి ఎలాగైనా ఎంట్రీ ఇవ్వాలని.. రీల్స్ మీద రీల్స్ చేస్తూ.. చివరికి బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.

బిగ్ బాస్‌ సీజన్ 7 గ్రాండ్‌ లాంచ్ ఈవెంట్లో కూడా.. నాగ్‌తో చాలా కాన్ఫిడెంట్‌గా మాట్లాడి.. సీరియస్ ప్లేయరేమో అనే ఫీల్ అందర్లో కలిగించారు.

కానీ కట్ చేస్తే.. షోలో.. అమ్మాయిలను ఫ్లట్‌ చేస్తూ... పులిహోర బిడ్డగా నెట్టింట నామ్ కమాయించారు పల్లవి.

మోడల్ కమ్ యాక్టరస్ అయిన రతిక చుట్టూ తిరిగుతూ.. పల్లవి ప్రశాంత్ తన ఆడాల్సిన గేమ్‌ను లైట్‌ తీసుకుంటున్నారు.

అప్పటికే కంటెస్టెంట్స్ అందరిలో కాస్త వ్యతిరేకత ఉన్న శివాజీ క్యాంపులో.. కంటిన్యూ అవుతూ వస్తున్నారు పల్లవి.

ఇక ఈ క్రమంలోనే తాజాగా జరిగిన బిగ్ బాస్ సీజన్ 7 నామినేషన్స్‌లో హౌస్ లో కార్నర్ అయ్యారు పల్లవి ప్రశాంత్.

హౌస్‌లోని నలుగురు నామినేట్‌ చేస్తూ పల్లవి ప్రశాంత్ గేమ్‌ను తీరను విమర్శిస్తూ దారణ కామెంట్స్ చేశారు. మరో కంటెస్టెంట్ యాక్టర్ అమర్‌దీప్‌ అయితే పల్లవి ప్రశాంత్ గాలి తీసేశారు.