20 September 2023

పల్లవి ప్రశాంత్ ఆస్తుల వివరాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

Pic credit - Instagram

ప్రస్తుతం పల్లవి ప్రశాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బిగ్ బాస్ షో ద్వారా ఒక రేంజ్ పాపులారిటీ సంపాదించుకున్నాడు.

పల్లవి ప్రశాంత్ రైతుబిడ్డ కావడంతో  సామాన్యుల నుండి మంచి సపోర్ట్ అందుతుంది. దీనితో సోషల్ మీడియాలో పల్లవి ప్రశాంత్ పేరు మారుమ్రోగుతోంది.

అయితే ప్రస్తుతం పల్లవి ప్రశాంత్ యొక్క ఆస్తులకు సంబంధించి వివరాలపై షాకింగ్ విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

పల్లవి ప్రశాంత్ మధ్య తరగతి కుటుంబమే అయినా దాదాపు 26 ఎకరాల పొలం ఉందని ఇది కోట్ల రూపాయల విలువ చేస్తుంది బోగట్టా.

 ఇదే కాక  ఒక లగ్జరీ ఇల్లుతో పాటు ఖరీదైన కారు కూడా పల్లవి ప్రశాంత్ కు ఉందని సమాచారం. సోషల్ మీడియా పోస్ట్ ల ద్వారా పల్లవి ప్రశాంత్ భారీగా  సంపాదిస్తున్నాడని  తెలుస్తోంది.

రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ కు  బిగ్ బాస్ ద్వారా వారానికి లక్ష రూపాయల చొప్పున పారితోషికం అందుతుందని  తెలుస్తోంది. రెమ్యునరేషన్ కంటే గుర్తింపే ముఖ్యమని అర్ధమవుతుంది.