చైతూ పాకిస్తాన్‌కి వెళ్లనన్నారా?

TV9 Telugu

12 March 2024

థంబ్‌నైల్‌ చూడగానే నాగచైతన్య పాకిస్తాన్‌కి ఎందుకు వెళ్లాలి? ఎందుకు వెళ్లట్లేదు.. అని అనుకుంటున్నారా?

ఇక్కడ మనం మాట్లాడుకోబోతున్నది చందు మొండేటి దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా వస్తున్న తండేల్‌ సినిమా గురించి.

యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మోవీలో పాకిస్తాన్‌ జైలుకి వెళ్లిన ఉత్తరాంధ్ర కుర్రాడిగా కనిపిస్తారు చైతూ.

ఆ సన్నివేశాల షూటింగ్ కోసం హైదరాబాద్‌ నగరంలోనే పాకిస్తాన్‌ జైలకి సంబంధించిన సెట్‌ వేశారు తండేల్ మూవీ మేకర్స్.

దర్శకుడు చందు మొండేటితో టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్యకి ఈ సినిమాకు ముందే ఆల్రెడీ మంచి ఈక్వేషన్‌ ఉంది.

వాళ్లిద్దరి కాంబినేషన్‌కి సాయిపల్లవి కూడా యాడ్‌ కావడంతో ప్రాజెక్ట్ మీద ఆల్రెడీ పాజిటివ్‌ బజ్‌ మొదలైంది.

దానికి తోడు... బుజ్జితల్లి వచ్చేత్తున్నాను గదే.. నవ్వవే అంటూ వేలంటైన్స్ డే సందర్భంగా చైతూ, పల్లవి చేసిన రీల్‌ కూడా విపరీతంగా ఆకట్టుకుంటోంది.

తండేల్ సినిమా ఈ ఏడాది దసరాకు విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారు మూవీ మేకర్స్. అయితే అప్పుడు దేవర మూవీ ఉంది.