25 August 2024
సీరియల్లో పద్దతిగా.. నెట్టింట మత్తెక్కించే 'కుట్టి' వయ్యారాలు..
Rajitha Chanti
Pic credit - Instagram
ప్రస్తుతం బుల్లితెరపై మంచి టీఆర్పీ రేటింగ్ సొంతం చేసుకుని తెలుగు ఫ్యామిలీ ప్రేక్షకులను అలరిస్తున్న సీరియల్ 'పాపే మా జీవనజ్యోతి'.
బెంగాలీ సీరియల్ మా టోమే చరా గుమ్ అసేనా రీమేక్‌గా తెరకెక్కిస్తున్నారు. ఇందులో కుట్టీ, ఆనందిగా నటిస్తుంది కన్నడ నటి హేమ శ్రీ.
ఈ సీరియల్ కథ మొత్తం కుట్టీ పాత్ర చుట్టూనే తిరుగుతుంది. ఇందులో బస్తీ అమ్మాయిగా సింపుల్, పద్దతిగా కనిపించి మెప్పించింది హేమ.
బెంగుళూరులో బీటెక్ పూర్తిచేసిన హేమశ్రీకి చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. దీంతో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది.
ఆ తర్వాత పలు కన్నడ సీరియల్స్ చేసింది. కన్నడతి, రాధే శ్యామ్, హిట్లర్ కళ్యాణ సీరియల్స్ ద్వారా అలరించి అక్కడ గుర్తింపు తెచ్చుకుంది.
క్యూట్, అమాయకమైన నటనతో ప్రేక్షకులకు దగ్గరైన హేమశ్రీ.. ఇప్పుడు పాపే మా జీవనజ్యోతి సీరియల్ ద్వారా తెలుగువారిని అలరిస్తుంది.
అయితే సీరియల్లో పంజాబీ డ్రెస్సులు, లంగావోణిలలో అచ్చ తెలుగింటి అమ్మాయిల కనిపించే హేమశ్రీ నెట్టింట మోడ్రన్ లుక్‌లో షాకిస్తుంది.
చిట్టి పొట్టి డ్రెస్సులతో ఫుల్ గ్లామర్ ఫోజులతో మతిపోగొట్టేస్తుంది హేమశ్రీ. ప్రస్తుతం ఈ బ్యూటీ స్టన్నింగ్ ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.
ఇక్కడ క్లిక్ చేయండి.