పాల్ అట్రీడెస్ హౌస్ హర్కోనెన్‌కి వ్యతిరేకంగా యుద్ధం నేపథ్యంలో వచ్చిన డ్యూన్: పార్ట్ 2 జియో సినిమాలో ఆగస్టు 1 నుంచి స్ట్రీమ్ అవుతుంది.
త్రిష కృష్ణన్ పోలీసు అధికారిగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ 'బృందా' ఆగస్ట్ 2న నుండి సోనీలివ్ లో స్ట్రీమింగ్ కానుంది.
'మోడరన్ మాస్టర్స్: S. S. రాజమౌళి,' అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్, ఫిల్మ్ కంపానియన్ స్టూడియోస్‌తో కలిసి నెట్‌ఫ్లిక్స్ నిర్మించిన డాక్యు-ఫిల్మ్ ఆగస్ట్ 2న విడుదల కానుంది.
కింగ్‌డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ సినిమా సైన్స్ ఫిక్షన్ సినిమా డిస్నీ+ హాట్‌స్టార్ లో ఆగష్టు 2న రానుంది.
కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ డ్రామా సినిమా భారతీయుడు 2 ఆగష్టు 2న నెట్‌ఫ్లిక్స్ వేదికగా వస్తుంది.
మలయాళీ స్టార్ మమ్ముట్టి హీరోగా తెరకెక్కిన యాక్షన్ కామెడీ చిత్రం టర్బో సోనీలివ్ వేదికగా ఆగష్టు 9న విడుదల కానుంది.
15 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న హత్య కేసుల చుట్టూ తిరిగే థ్రిల్లర్ సినిమా గ్యరా గ్యరా జీ5లో ఆగష్టు 9న రానుంది.
ప్రపంచ బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చూపించిన తెలుగు సినిమా కల్కి 2898 ఏడీ సినిమా ఆగష్టు 15న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయ్యా అవకాశం ఉంది.