TV9 Telugu
ఆపరేషన్ వాలెంటైన్ సక్సెస్ మీట్.. సేవ్ ది టైగర్స్ 2..
04 March 2024
వరుణ్ తేజ్, మానుషి చిల్లర్ జంటగా కొత్త దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ తెరకెక్కించిన సినిమా ఆపరేషన్ వాలెంటైన్.
ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా మార్చి 1న విడుదలైంది. పుల్వామా ఉగ్రదాడి ఆధారంగా ఈ సినిమా రూపొందింది.
తాజాగా ఈ చిత్ర సక్సెస్ మీట్ ఏర్పాటు చేసారు దర్శక నిర్మాతలు. సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుందని తెలిపారు.
దేశభక్తి కథాంశంతో వస్తున్న చిత్రం ‘రికార్డ్ బ్రేక్’. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు దర్శకుడు చదలవాడ శ్రీనివాసరావు.
ఈ సినిమా నుంచి రెండో లిరికల్ సాంగ్ విడుదల చేసారు. శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ బ్యానర్‌పై చదలవాడ పద్మావతి ఈ చిత్రాన్ని నిర్మించారు.
ప్రియదర్శి, అభినవ్ గోమటం, కృష్ణ చైతన్య ప్రధాన పాత్రల్లో మహి వి రాఘవ్ క్రియేట్ చేసిన వెబ్ సిరీస్ సేవ్ ది టైగర్స్.
ఈ సిరీస్ సీజన్ 1 ఇప్పటికే మంచి విజయం సాధించింది. ఇప్పుడు దినికి రెండో సీజన్ కూడా తీసుకొస్తున్నారు మేకర్స్.
ఈ క్రమంలోనే సెప్టెంబర్ 15 నుంచి సేవ్ ది టైగర్స్ 2 ప్రముఖ ఓటిటిలో స్ట్రీమ్ కానుంది. తాజాగా ట్రైలర్ విడుదల చేసారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి