OTTలో దూసుకుపోతున్న మెగా ప్రిన్స్ 

TV9 Telugu

24  March 2024

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన లేటేస్ట్ మూవీ ఆపరేషన్ వాలెంటైన్ మార్చి 1న రిలీజ్ అయి.. డీసెంట్ టాక్ తెచ్చుకుంది.

డీసెంట్ టాక్ తెచ్చుకోవడమే కాదు.. ఎయిర్ ఫోర్స్ డ్రామాగా మొదటిసారి తెలుగులో తెరకెక్కిన ఈ సినిమా ఇదే.. కొన్ని వర్గాల ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

వార్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో విజువల్స్ మాత్రం అదరిపోయాయి. రుద్ర అనేపాత్రలో వరుణ్ తేజ్ నటించాడు.

ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వైపే అందర్నీ చూసేలా చేసింది. కానీ.. సడెన్ ట్విస్ట్ ఇస్తూ..చడీ చప్పుడు కాకుండా.. ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ కు వచ్చేసింది.

ఎస్ ! రిలీజ్ అయిన 20 రోజుల్లోనే ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా అందుబాటులోకి వచ్చేసింది.

తెలుగు, తమిళంలోనే కాకుండా ఇతర దక్షిణాది భాషల్లోనూ ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతూ అందరి నుంచి మంచి రెస్పాన్స్‌ వచ్చేలా కూడా చేసుకుంటోంది.

ప్రస్తుతం వరుణ్ మట్కా చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తోంది. ఇటీవలే ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది.