11 November 2023

మరోసారి హాట్ టాపిక్ గా విజయ్ పొలిటికల్ ఎంట్రీ.!

తమిళనాట టాప్ స్టార్స్‌ పొలిటికల్ న్యూస్‌ ఎప్పుడూ ట్రెండింగ్‌ టాపికే. కమల్‌ సినిమాలతో పాటు పాలిటిక్స్‌లోనూ కంటిన్యూ అవుతున్నారు.

రజనీకాంత్ రాజకీయం మనకు సెట్ అవ్వదని క్లారిటీ ఇచ్చేశారు. ఇప్పుడు అందరి దృష్టి విజయ్ మీదే ఉంది.

తాజాగా లియో సక్సెస్‌మీట్ తరువాత దళపతి పొలిటికల్ ఎంట్రీ మరోసారి హాట్ టాపిక్ అవుతోంది.

లియో రిలీజ్‌కు ముందు భారీ ఈవెంట్‌ను ప్లాన్ చేశారు మేకర్స్. కానీ అప్పట్లో పర్మిషన్ రాకపోవటంతో ఆ ఈవెంట్‌ జరగలేదు.

అయితే ఈవెంట్‌కు పర్మిషన్స్ రాకపోవటం వెనుక పొలిటికల్ రీజన్స్ ఉన్నాయన్నటాక్ చాలా బలంగా వినిపించింది.

అదే సమయంలో దళపతి రాజకీయ అరంగేట్రం గురించిన చర్చ కూడా మరోసారి తెర మీదకు వచ్చింది.

కొద్ది రోజులుగా విజయ్‌ని సూపర్ స్టార్ అంటూ కొంత మంది సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

అయితే లియో వేడుకలో తాను దళపతిని మాత్రమే, కోలీవుడ్‌లో ఒక్కరే సూపర్ స్టార్ ఉన్నారంటూ క్లారిటీ ఇచ్చేశారు.

లియో సక్సెస్‌మీట్‌లో విజయ్‌ చేసిన కామెంట్స్ పొలిటికల్‌ సర్కిల్స్‌లోనూ హాట్ టాపిక్ అవుతున్నాయి.