మరోసారి కొత్త దర్శకుని ఛాన్స్.. నయనతార..
కొత్త దర్శకులకు ఛాన్స్ ఇవ్వడంలో ఎప్పుడు ముందుండే వారిలో నయనతార ఒకరు.
కథ నచ్చితే చాలు డైరెక్టర్ ఎవరైనా నటిస్తుంది ఈ భామ.
కోలీవుడ్‌లో అశ్విన్ శరవణన్ వంటి దర్శకులకు మొదటి అవకాశం ఇచ్చింది నయనతారనే.
కాగా లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో ఎక్కువగా నటిస్తుంది ఈ బ్యూటీ.
తాజాగా కథ నచ్చడంతో మరో ఉమెన్ సెంట్రిక్ చిత్రానికి పచ్చ జెండా ఊపింది నయన్.
విక్కీ డ్యూడ్ అనే ఓ యూట్యూబర్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కానున్నారని సమాచారం.
ఈ నెలలోనే ఈ చిత్రం చిత్రీకరణ ప్రారంభం కానుందని తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ చిత్రంతో పాటు మరో నాలుగు చిత్రాల్లో నటిస్తుంది నయన్.
వీటిలో షారుక్ ఖాన్‌కి జోడిగా చేస్తున్న హిందీ మూవీ ‘జవాన్’ ఒకటి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి