హ్యాష్‌ట్యాగ్‌లో అదరగొట్టావ్‌ డార్లింగ్‌!

TV9 Telugu

18 March 2024

శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రల్లో శ్రీ హర్ష తెరకెక్కిస్తున్న సినిమా ఓం భీమ్ బుష్.

యువీ క్రియేషన్స్ నుంచి ఈ సినిమా వస్తుంది. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు.

ట్రైలర్ పూర్తిగా వినోదాత్మకంగా ఉంది. మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రానుంది కామెడీ ఎంటర్టైనర్ ఓం భీమ్ బుష్.

విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీకి వచ్చినా.. బేబీ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నారు ఆనంద్ దేవరకొండ. ప్రస్తుతం ఈయన వరస సినిమాలు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఈయన నటిస్తున్న గంగం గణేషతో పాటు డ్యూయెట్ లుక్స్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు. ఈ రెండూ 2024లోనే విడుదల కానున్నాయి.

అభిమానులకు సారీ చెప్పారు సంగీత దర్శకుడు థమన్. గుంటూరు కారంలో 7వ పాటను మార్చి 15న విడుదల చేస్తానని చెప్పిన థమన్ ఇప్పుడు మాట మార్చారు.

ఊహించని విధంగా, మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్ తన ట్విట్టర్ ఖాతాలో పాటకు సంబంధించిన పోస్ట్‌ను తొలగించారు.

అంతేకాదు.. ఇంక ఏం లేదు.. తదుపరి విడుదలలు ఉండవు.. ది ఎండ్.. క్షమించండి అంటూ ట్విటర్ (ఎక్స్)లో పోస్ట్ చేసారు.