సుహాస్ హీరోగా కొత్త సినిమా.. నితిన్ లుక్స్..

TV9 Telugu

01 April 2024

యూ ట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్స్ చేసుకునే స్థాయి నుంచి ఇండస్ట్రీలో నిర్మాతలు నమ్మే మినిమమ్ గ్యారెంటీ హీరోగా ఎదగడం అంటే చిన్న విషయం కాదు.

దాన్ని చేసి చూపిస్తున్నారు సుహాస్. తాజాగా ఓ భామ అయ్యో రామా అనే కలర్ ఫుల్ లవ్ స్టోరీకి సైన్ చేసారు సుహాస్.

రామ్ గోదాల ఈ సినిమాకు దర్శకుడు. V ఆర్ట్స్, చిత్రలహరి టాకీస్ బ్యానర్స్‌పై హరీష్ నల్లా, ప్రదీప్ సంయుక్తంగా సుహాస్ సినిమాను నిర్మిస్తున్నారు.

త్వరలోనే షూటింగ్ మొదలు కానుంది. ఇటీవల ప్రసన్నవదనం అనే సినిమాను కూడా ప్రకటించారు టాలీవుడ్ హీరో సుహాస్.

సినిమా ఫలితంతో సంబంధం లేకుండా తెలుగులో వరస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు టాలీవుడ్ యంగ్ హీరో నితిన్.

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈయన నటిస్తున్న సినిమాకు తమ్ముడు అనే క్రేజీ టైటిల్ ఖరారు చేసిన సంగతి తెలిసిందే.

ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాత. పవన్ కెరీర్‌లో హిట్ సినిమా టైటిల్‌ను దీనికి వాడేస్తున్నారు హీరో నితిన్.

ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసాకు దర్శక నిర్మాతలు. దాంతో పాటు రాబిన్ హుడ్ లుక్ కూడా విడుదల చేసారు మేకర్స్.