ఓజి నుంచి సర్‌ప్రైజ్.. సందీప్ జావెద్  మాటల యుద్ధం..

TV9 Telugu

18 March 2024

పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబో చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఓ టీజర్ విడుదల చేయబోతున్నట్లు తెలిపారు మేకర్స్.

అలాగే ఓజి సినిమా నుంచి కూడా ఓ స్పెషల్ టీజర్ ప్లాన్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన అప్‌డేట్ కూడా వచ్చింది.

అయితే ఆ టీజర్ ఎప్పుడు విడుదల చేస్తారనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. సినిమా సెప్టెంబర్ 27న విడుదల కానుంది.

ఇటీవల మిషన్ ఇంపాజిబిల్‌ 8 షూటింగ్‌ ఓ లొకేషన్‌కు చేరుకునే మార్గంలో ఇబ్బందులు ఎదురు కావటంతో యూనిట్ మొత్తాన్ని ప్రత్యేక హెలికాప్టర్లలో తీసుకెళ్లింది యూనిట్‌.

షూటింగ్ ఆలస్యమైతే జరిగే నష్టం కన్నా... హెలికాప్టర్ల కోసం పెట్టే ఖర్చు తక్కువగా ఉండటం వల్లే ఈ నిర్ణయం తీసుకుంది చిత్రయూనిట్‌.

సెన్సేషనల్ డైరెక్టర్‌ సందీప్ రెడ్డి వంగా, బాలీవుడ్ లెజెండరీ లిరిసిస్ట్‌ జావెద్ అక్తర్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.

యానిమల్‌ సినిమాపై విమర్శలు చేశారు జావెద్‌. ఆ కామెంట్స్ మీద స్పందించిన సందీప్‌, నీ కొడుకు తీసిన మీర్జాపూర్‌ చూడలేదా అంటూ కౌంటర్‌ ఇచ్చారు.

సందీప్ కామెంట్ మీద రియాక్ట్ అయిన జావెద్‌, నా కెరీర్‌లో ఒక్క తప్పు కూడా దొరక్క, నా కొడుకు సినిమాను ఉదహరించావా అంటూ రిప్లై ఇచ్చారు.