ఓజి వచ్చేస్తున్నాడు.. అదుర్స్ 2 ఉందండోయ్..

TV9 Telugu

05 April 2024

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గ్యాంగ్ స్టర్ డ్రామా ఓజి.

సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల అవుతుందని ఇప్పటికే చెప్పారు మేకర్స్. దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి.

తాజాగా ఓజి రిలీజ్ డేట్‌పై నిర్మాత డీవీవీ దానయ్య మరోసారి కామెంట్ చేసారు. ఓజి సెప్టెంబర్ 27న మీ ముందుకు వస్తుందంటూ క్లారిటీ ఇచ్చారు.

మలయాళ పరిశ్రమలో కొత్త ఇండస్ట్రీ హిట్ మంజుమ్మెల్ బాయ్స్. ఈ సినిమాను తెలుగులో ఏప్రిల్ 6న విడుదల చేయబోతున్నారు మైత్రి మూవీ మేకర్స్.

ఈ సర్వైవల్ థ్రిల్లర్‌ ప్రీ రిలీజ్ ఈవెంట్ తాజాగా జరిగింది. దీనికి చిత్రయూనిట్ సహా.. పలువురు ప్రముఖులు వచ్చారు.

ఎన్టీఆర్ కెరీర్‌లో కల్ట్ కామెడీ సినిమా అదుర్స్. తాజాగా ఈ సినిమా సీక్వెల్‌పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు కథా రచయిత కోన వెంకట్.

రాబోయే రోజుల్లో ఎన్టీఆర్‌తో అదుర్స్ 2 తప్పకుండా ఉంటుందని అన్నారు. అయితే ఎప్పుడు సినిమా చేయనున్నారు క్లారిటీ లేదు.

తెలుగు ఇండస్ట్రీలోనే కాదు మొత్తం ఇండియాలోనే తారక్ చేసిన విధంగా చారి క్యారెక్టర్‌ని ఏ నటుడు చేయలేడన్నారు.