నువ్వు నేను ఏమంటున్నారు..? విశ్వంభర షెడ్యూల్ పూర్తి
TV9 Telugu
23 March 2024
ఉదయ్ కిరణ్, అనిత జంటగా తేజ తెరకెక్కించిన క్లాసిక్ లవ్ స్టోరీ నువ్వు నేను. ఈ సినిమాను మరోసారి థియేటర్లలో విడుదల చేసారు దర్శక నిర్మాతలు.
దీనికి ఉదయ్ కిరణ్ అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది. మెయిన్ థియేటర్స్ దగ్గర సందడి వాతావరణం కనిపించింది.
మరోసారి ఉదయ్‌ను స్క్రీన్ మీద చూడటం ఆనందంగా ఉందన్నారు ఫ్యాన్స్. ఈ చిత్రం అప్పట్లో బ్లాక్ బస్టర్ అయింది.
చిరంజీవి, త్రిష కృష్ణన్ జంటగా వశిష్ట తెరకెక్కిస్తున్న సినిమా విశ్వంభర. ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతుంది.
ఈ చిత్ర తాజా షెడ్యూల్ పూర్తైంది. త్వరలోనే హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు.
200 కోట్లకు పైగా బడ్జెట్‌తో యువీ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. జనవరి 10, 2025న విడుదల కానుంది విశ్వంభర.
విజయ్ దేవరకొండ, మృణాళ్ ఠాకూర్ జంటగా పరశురామ్ తెరకెక్కిస్తున్న సినిమా ఫ్యామిలీ స్టార్. ఈ మధ్యే షూటింగ్ పూర్తి చేసుకుంది.
ఈ చిత్రం తాజాగా ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ఎప్రిల్ 5న విడుదల కానుంది ఫ్యామిలీ స్టార్. రాబోయే రెండు వారాలు ప్రమోషనల్ ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.