దివిలో తారకు చెల్లిలా మెరిసిపోతున్న నుపుర్ సనన్..
09 November 2023
15 డిసెంబర్ 1995న దేశ రాజధాని ఢిల్లీలో జన్మించింది అందాల తార నుపుర్ సనన్. ఈమె స్టార్ హీరోయిన్ కృతి సనన్ చెల్లెలు.
న్యూఢిల్లీలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో తన హైస్కూల్ విద్యను పూర్తిచేసింది వయ్యారి భామ నుపూర్ సనన్.
చదువుకునే రోజుల్లో చదువులో బాగానే ఉండేది. తర్వాత ఢిల్లీ యూనివర్సిటీలో సంగీతంలో కోర్సు పూర్తి చేసింది.
2019లో ఫిల్‌హాల్ అనే ఓ యూట్యూబ్ మ్యూజిక్ వీడియోలలో నటించి తన కెరీర్ ను ప్రారంబించింది ఈ వయ్యారి భామ.
తర్వాత 2021లో ఫిల్‌హాల్ 2: మొహబ్బత్ మరో యూట్యూడ్ మ్యూజిక్ వీడియోలో అక్షయ్ కుమార్ పక్కన ఆడి పడింది ఈ బ్యూటీ.
తర్వాత 2023లో పాప్ కౌన్? అనే ఓ హిందీ టెలివిజన్ ధారావాహికలో ప్రధాన పాత్రలో నటించి మెప్పించింది ఈ వయ్యారి.
2023లో స్టూవర్టుపురం దొంగ బయోపిక్ గా తెరకెక్కిన తెలుగు చిత్రం టైగర్ నాగేశ్వర రావు సినిమాలో రవితేజకి జోడిగా వెండితెర అరంగేట్రం చేసింది.
ప్రస్తుతం నూరానీ చెహ్రా అనే ఓ బాలీవుడ్ చిత్రంలో నటిస్తుంది ఈ వయ్యారి. ఈ చిత్రంతో హిందీలో కథానాయకిగా పరిచయం కానుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి