ఎన్టీఆర్‌ నారదుడు, ఆంజనేయుడి పాత్రలు ఎందుకు చేయలేదో తెలుసా?

May 28, 2024

TV9 Telugu

TV9 Telugu

తెలుగు వారికి రాముడు, కృష్ణుడు అంటే గుర్తొచ్చే ఒకే ఒక్క పేరు నందమూరి తారక రామారావు. ఆయన నటించిన సినిమాల్లోని పౌరాణిక పాత్రలు అందుకు నిదర్శనం

TV9 Telugu

ఇప్పటికీ కొందరు ఇళ్లల్లో రాముడు, కృష్ణుడి వేషంలో ఉన్న ఎన్టీఆర్‌ ఫొటోలను పూజగదిలో పెట్టుకుని పూజిస్తున్నారంటే ఆయన తెలుగు ప్రేక్షకులకు ఎంతగా దగ్గరయ్యారో చెప్పవచ్చు

TV9 Telugu

డైలాగులు, హావభావాలు పలికించడంలో ఆయనకు తిరుగులేదు. పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలతో వెండితెరపై అదరగొట్టిన ఎన్టీఆర్‌ తెలుగువారి గుండెల్లో అభిమాన నటుడిగా చిరస్థాయిగా నిలిచిపోయారు

TV9 Telugu

రాముడు, కృష్ణుడు, దుర్యోధనుడు, భీముడు, రావణుడిగా ఎన్నో పాత్రల్లో ఒదిగిపోయిన ఎన్టీఆర్‌.. దేవుళ్లు కనిపిస్తే ఇలాగే ఉంటారు అనే రీతిలో ఆయన ఆయా పాత్రలకు ప్రాణం పోశారు

TV9 Telugu

ఇంత పేరు ప్రఖ్యాతులను సంపాదించిన ఆయన తన సినీ ప్రస్థానంలో ఒక్క నారదుడు, హనుమంతుడి పాత్రలను మాత్రం వేయలేదు. ఇదే విషయాన్ని ఓసారి రావి కొండలరావు ఆయనను అడిగారట

TV9 Telugu

‘నారదుడు, హనుమంతుడు వంటివి కూడా ముఖ్య పాత్రలే కదా! అన్నగారూ... ఆ పాత్రల్లో మిమ్మల్ని చూసే అవకాశం ఉందా?’ అని ఎన్టీఆర్‌ను ఓ సందర్భంలో రావి కొండలరావు అడిగారట

TV9 Telugu

అప్పుడు ఎన్టీఆర్‌ బదులిస్తూ.. ‘నారదుడిగా ఆలోచించాను బ్రదర్‌. హాస్యం వచ్చేలా కాకుండా భక్తుడిగా, సర్వజ్ఞుడిగా గంభీరంగా ప్రదర్శించవచ్చు. కానీ, నా రూపం అందుకు సహకరించదేమోనని సాహసించలేదు

TV9 Telugu

నారదుడు అంటే ఇలాగే ఉండాలి అని మనం ఒక విధమైన రూపానికి అలవాటు పడ్డాం. నా శరీరం కాస్త భారీగా ఉంటుంది. రంగారావుగారిని నారదుడి పాత్రలో ఊహించుకోగలమా? పర్సనాలిటీలు ఒప్పుకోవు

TV9 Telugu

ఇక హనుమంతుడంటారా? నా ముఖం కానప్పుడు నాకెందుకా పాత్ర? మాస్క్‌తో నటించాలి. ఫిజికల్‌ మూవ్‌మెంట్స్‌‌ ఎక్కువ కావాలి’ అని ఎన్టీఆర్‌ సమాధానం చెప్పారట