పది రోజులు అక్కడే! తారక్..

TV9 Telugu

13 April 2024

బాలీవుడ్ స్టార్ హృతిక్‌ రోషన్‌, టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ నటిస్తున్న యాక్షన్-థ్రిల్లర్ సినిమా వార్‌2.

తాజాగా దేవర సినిమాకి బ్రేక్ ఇచ్చి ఈ సినిమా సెట్స్ లో జాయిన్‌ అయ్యారు పాన్ ఇండియా స్టార్ హీరో ఎన్టీఆర్‌.

ఇందులో తారక్ కాస్త నెగిటివ్ షేడ్స్ ఉన్న ఓ ఇండియన్ ఏజెంట్ గా నటిస్తున్నారు. ఆయనకి జోడిగా అలియా భట్ నటిస్తున్నట్టు సమాచారం.

YRF స్పై యూనివర్స్ లో భాగంగా బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది.

తాజాగా హీరో జూనియర్ ఎన్టీఆర్‌ ముంబై ప్రయాణానికి సంబంధించిన విజువల్స్ నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతున్నాయి.

ముంబైలో పది రోజుల పాటు బాలీవుడ్ ఇండస్ట్రీ యాక్షన్ థ్రిల్లర్ వార్ 2 సినిమా షూటింగ్‌లో పాల్గొంటారు తారక్‌.

ఈ భారీ స్పై యూనివర్స్ చిత్రం కోసం మొత్తం 60 రోజులు కాల్షీట్‌ కేటాయించారు పాన్ వరల్డ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్.

ఈ బ్లాక్ బస్టర్ సీక్వెల్ లో సినిమాలో ఓ కథానాయకిగా నటిస్తున్న కియారా అద్వానీ ఇప్పటికే మూవీ సెట్స్ పైకి వెళ్లారు.