ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. దేవర మేకర్స్ కీలక నిర్ణయం!

30 September 2024

Basha Shek

ఎన్టీఆర్ దేవర సినిమా బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొడుతోంది. కేవలం రిలీజైన మూడురోజుల్లోనే రూ.304 కోట్లు రాబట్టింది.

కొరటాల శివ తెరకెక్కించిన ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది.

దేవర సినిమాకు రిలీజ్ ముందు ట్రైలర్స్, సాంగ్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ముఖ్యంగా ఇందులోని సాంగ్స్ ఫ్యాన్స్ కి మంచి ఊపు ఇచ్చాయి.  అయితే ఇటీవల రిలీజైన సినిమాలో ఒక సాంగ్ ని తీసేసారు

ఎన్టీఆర్, జాన్వీ కపూర్ పై తెరకెక్కించిన దావూదీ.. అనే సాంగ్ సినిమాలో లేదు.  దీంతో ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.

సినిమా నిడివి అప్పటికే 3 గంటలు ఉంది అందుకే నిడివి ఎక్కువైందని ఈ సాంగ్ తొలగించినట్టు సమాచారం.

అయితే త్వరలోనే దావూదీ సాంగ్ ను సినిమాలో జత చేయనున్నారని తెలుస్తోంది. దీనిపై మరికొన్ని రోజుల్లో అప్డేట్ రానుందని టాక్.

సినిమా రిలీజ్ ముందు దావూదీ.. వీడియో సాంగ్‌కు ఫ్యాన్స్ నుంచి మంచి స్పందన వచ్చింది. ఎన్టీఆర్ స్టెప్స్, జాన్వీ అందాలు ప్రేక్షకులని అలరించాయి.