దేవరలో అరవింద సమేత పోలికలు?

TV9 Telugu

24 March 2024

ప్రస్తుతం జూనియర్‌ ఎన్టీఆర్‌ హీరోగా నటిస్తున్న సినిమా దేవర. ఈ సినిమాను కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు.

మిక్కిలినేని సుధాకర్‌, హరికృష్ణ.కె.సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జాన్వీ కపూర్‌ నాయిక. కల్యాణ్‌రామ్‌ సమర్పిస్తున్నారు.

సైఫ్‌ అలీ ఖాన్‌ ఈ సినిమాలో విలన్‌గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్‌ గోవాలో జరుగుతోంది.

కొరటాల శివ ఓ సోలో సాంగ్‌ని అక్కడ తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్‌ మాస్‌ అవతార్‌ చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

ప్రస్తుతం గోవాలో తెరకెక్కిస్తున్న పాటకు రాజు సుందరం కొరియోగ్రఫీ చేస్తున్నారు. సముద్ర తీరం బ్యాక్‌డ్రాప్‌లో జరిగే కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది.

అక్టోబర్‌ 10న దసరా కానుకగా విడుదల కానున్న ఈ సినిమాకు, అరవింద సమేతలోని ఓ విషయంతో లింక్‌ పెడుతున్నారు జనాలు.

త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అరవింద సమేతలోనూ తారక్‌ సోలో సాంగ్‌ ఉంది. అది సూపర్‌డూపర్‌ హిట్‌ అయింది.

ఇప్పుడు ఈ సినిమాలోనూ తారక్‌ సోలో సాంగ్‌ ఉంది. ఎమోషనల్‌గా వీటి రెండిటికీ మధ్య పోలికేమైందా ఉందా? అంటూ ఆరా తీస్తున్నారు అభిమానులు.