భారీ ధరకు దేవర ఓవర్సీస్ హక్కులు.. కంగువ నుంచి క్రేజీ అప్డేట్..

TV9 Telugu

28 January 2024

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న టాలీవుడ్ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా దేవర.

ఈ చిత్రంపై ఉన్న అంచనాలు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా ఈ చిత్ర ఓవర్సీస్ హక్కులు రూ. 27 కోట్లకు అమ్ముడైనట్లు ప్రచారం జరుగుతుంది.

ఆర్ఆర్ఆర్‌తో తారక్‌కు గ్లోబల్ ఇమేజ్ వచ్చింది.. అది దేవరకు బాగా హెల్ప్ అవుతుంది. భారీగా కలెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

పాజిటివ్ టాక్ వస్తే దేవర సినిమా ఈ మొత్తం వెనక్కి తీసుకురావడం పెద్ద కష్టమేం కాదంటున్నారు ట్రేడ్ పండితులు.

సూర్య, దిశా పటాని జంటగా శివ తెరకెక్కిస్తున్న చిత్రం కంగువ. సూర్య కెరీర్‌లోనే కాకుండా తమిళ ఇండస్ట్రీ చరిత్రలోనే బిగ్గెస్ట్ బడ్జెట్ చిత్రాల్లో ఇది కూడా ఒకటి.

ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ నటిస్తున్నారు. తాజాగా ఈయన లుక్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు.

2008లో వచ్చిన స్లమ్ డాగ్ మిలియనీర్‌లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించిన దేవ్ పటేల్ హీరోగా నటిస్తూ తెరకెక్కిస్తున్న సినిమా మంకీ మ్యాన్.

అంతర్జాతీయ నిర్మాణ సంస్థ యునివర్సల్ పిక్చర్స్ నిర్మిస్తున్న మంకీ మ్యాన్ ఏప్రిల్ 5 విడుదల కానుంది. హనుమంతుడి నేపథ్యంలోనే ఈ కథ సాగుతుంది.