దేవర సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ చిత్రయూనిట్ ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉన్నారు. తాజాగా ఫ్యాన్స్ కోసం ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు.
భారీ మిడ్ సీ నైట్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించాం.. తారక్ నీటి అడుగున ఉన్న సీన్స్ చాలా బాగా వచ్చాయి.
అండర్ వాటర్ సీన్స్ హైలైట్ కాబోతున్నాయి.. అంటూ ట్వీట్ చేసారు రత్నవేలు. ఈ చిత్రం గురించి సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
జానపద బ్రహ్మ విఠలాచార్య గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. తాజాగా ఈయన జీవితం ఆధారంగా ప్రముఖ జర్నలిస్ట్, పిఆర్ఓ పులగం చిన్నారాయణ ఓ పుస్తకం రాసారు.
ఈ బుక్‌ను దర్శకుడు త్రివిక్రమ్ విడుదల చేసారు. ఇలాంటి పుస్తకాలు చిన్నారాయణ ఇంకా ఎన్నో రాయాలని ఆకాంక్షించారు మాటల మాంత్రికుడు.
రవితేజ హీరోగా వంశీ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియన్ సినిమా టైగర్ నాగేశ్వరరావు. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
అక్టోబర్ 20న విడుదల కానుంది టైగర్ నాగేశ్వరరావు. తాజాగా ఈ సినిమాలో హేమలత లవణం పాత్రలో నటిస్తున్న రేణు దేశాయ్ లుక్ విడుదల చేసారు.
తాజాగా రేణు దేశాయ్ పాత్రను పరిచయం చేసారు దర్శక నిర్మాతలు. ఈ సినిమా ట్రైలర్ అక్టోబర్ 3న విడుదల కానుంది.