దేవర విషయంలో ఏం జరుగుతుంది..  వెంకీ నితిన్ మూవీ అప్డేట్..

TV9 Telugu

25 January 2024

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న పాన్ ఇండియా మాస్ ఎంటర్టైనర్ దేవర షూటింగ్ వేగంగా జరుగుతుంది.

ఈ మధ్య ఈ మూవీ పోస్టుపోన్ కానుందనే వార్తలు వైరల్ గా మారాయి. ఇటీవల సైఫ్ అలీ ఖాన్‌కు గాయం కావడంతో దీనికి మరింత బలం చేకూరింది.

ఇదిలా ఉంటే ఆంధ్ర ఎలక్షన్స్ కారణంగా దేవర ఎప్రిల్ 5న రాకపోవచ్చనే మరో వార్త వినిపిస్తుంది. కానీ టీం దీనిపై స్పందించలేదు.

కంగన రనౌత్ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న బయోపిక్ చిత్రం ఎమర్జెన్సీ. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేసారు.

కంగనా ఇందిరా గాంధీ పాత్రలో నటించిన ఈ సినిమా ఈ ఏడాది జూన్ 14న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రకటించారు.

భీష్మ లాంటి హిట్ తర్వాత దర్శకుడు వెంకీ కుడుముల, యంగ్ హీరో నితిన్ కాంబినేషన్‌లో మరో సినిమాను ప్రకటించారు.

ఈ మూవీ చిత్రీకరణ వేగంగా జరుగుతుంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలకు సంబంధించి క్లారిటీ వచ్చింది.

జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా ఉదయం 11.07 గంటలకు లుక్ విడుదల చేయనున్న మేకర్స్. ఇందులో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుంది.