TV9 Telugu
దేవర అప్‌డేట్ ఇచ్చిన జాన్వీ.. నాని కొత్త సినిమా..
25 Febraury 2024
దేవర షూటింగ్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చారు జాన్వీ కపూర్. ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను ఎన్టీఆర్‌తో ఇంకా సినిమా షూటింగ్ చేస్తున్నానని తెలిపారు.
కొన్ని పాటలు కూడా బాలన్స్ ఉన్నాయని.. షూటింగ్‌పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు జాన్వీ. ఈ లెక్కన అనిరుధ్ ఇంకా మ్యూజిక్ ఇవ్వలేదని అర్థమవుతుంది.
సింహాద్రి సినిమాను మరోసారి విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం మార్చ్ 1, 2024న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో రీ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే మార్చ్ 2న బాలయ్య కల్ట్ బ్లాక్‌బస్టర్ సమరసింహారెడ్డి సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. ఇలా బాబాయ్ అబ్బాయి పోటీ పడుతున్నారు.
త్రిగుణ్, కాజల్ కుందర్ జంటగా రఘు శాస్త్రి తెరకెక్కిస్తున్న సినిమా లైన్ మ్యాన్. తెలుగు, కన్నడ భాషలలో ఈ సినిమా వస్తుంది.
తాజాగా ఈ సినిమా మోషన్ పోస్టర్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు. ఓ గ్రామం నేపథ్యంలోనే ఈ సినిమా కథ అంతా సాగుతుంది.
నాని ప్రస్తుతం సరిపోదా శనివారం సినిమాతో బిజీగా ఉన్నారు. దీని తర్వాతి సినిమాను కూడా ప్రకటించారు న్యాచురల్ స్టార్.
సుజీత్ దర్శకత్వంలో ఈ సినిమా ఉండబోతుంది. డివివి దానయ్య ఈ సినిమాకు నిర్మాత. ఇది నాని 32వ సినిమాగా వస్తుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి