దేవర.. చలో గోవా
TV9 Telugu
19 March 2024
నీరెక్కడుంటే అక్కడ చైతన్యం ఉంటుంది. ప్రగతి ఉంటుంది... అనే మాటలు పాతబడిపోయాయి. ఇప్పుడు దీనికి కొత్త మాటలు వచ్చాయి.
నీరెక్కడుంటే అక్కడ దేవర ఉంటాడు అనేది ఇప్పుడు టాలీవుడ్ సినిమా ప్రేమికులకు ఎక్కువగా వినిపిస్తున్న కొత్త మాట.
సముద్రం ఎరుపెక్కి పోవడమంటే ఏంటో ఆల్రెడీ ఈ మూవీ గ్లింప్స్ లోనే చెప్పేశారు టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్.
భయం తెలియని వారిని భయపెట్టే వ్యక్తిగా ఆయన నటనకు ఫిదా అవుతారు ఆడియన్స్ అంటూ ఊరిస్తున్నారు కొరటాల శివ.
రెండు పార్టులుగా తెరకెక్కే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా దేవర ఫస్ట్ పార్ట్ షూటింగ్ ఇప్పుడు జరుగుతోంది.
ఈ అక్టోబర్ 10న దసరా పండగ కానుకగా దేవర పార్ట్ ఒన్ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ప్రస్తుతం గోవాలో కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. శంషాబాద్‌లో క్రియేట్ చేసిన అండర్‌వాటర్ సెట్‌లో చాలా వరకు సన్నివేశాలను చిత్రీకరించారు.
ఈ సినిమాతోనే సౌత్ ఎంట్రీ ఇస్తున్నారు జాన్వీ కపూర్. తారక్, జాన్వీ కలిసి చేసే అద్దిరిపోయే స్టెప్పులతో దేవర పాటలు మరో రేంజ్‌లో ఉంటాయనే టాక్.
ఇక్కడ క్లిక్ చెయ్యండి