దేవరపై వస్తున్న వార్తకు క్లారిటీ.. రజాకార్ ట్రైలర్..

TV9 Telugu

12 February  2024

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తున్న బారి యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా దేవర.

ఈ సినిమా రెండు భాగాలుగా వస్తుంది. ఎన్టీఆర్ సరసన అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ కథానాయకిగా నటిస్తుంది.

ఈ చిత్రంలో ఎన్టీఆర్ రెండు పాత్రలు చేస్తున్నారంటూ ఇన్నాళ్ళూ ప్రచారం జరిగింది. దీనిపై ఇప్పుడు క్లారిటీ వచ్చింది.

ఇందులో తారక్ డ్యూయల్ రోల్ చేస్తున్నారు. అందులో ఓ తారక్‌ పాత్రకు జోడీగా తాను నటిస్తున్నట్లు మరాఠీ నటి శృతి మరాఠే తెలిపారు.

వివాదాస్పద కథలకు ఈ మధ్య గిరాకీ బాగా పెరిగిపోయింది. తాజాగా నిజాం పాలకుల సమయం నాటి రజాకార్ కథ వస్తుందిప్పుడు.

ఈ సినిమా పోస్టర్ విడుదలైనప్పటి నుంచే దీనిపై వివాదం మొదలైంది.. తర్వాత టీజర్, పాట వచ్చాక ఇంకాస్త ముదిరింది.

తాజాగా ఈ  మూవీ హిందీ ట్రైలర్ విడుదల చేసారు మూవీ మేకర్స్. కాగా తెలుగు ట్రైలర్‌ను ఫిబ్రవరి 12న విడుదల చేస్తామని చెప్పారు దర్శక నిర్మాతలు.

ఈ సినిమా మార్చ్ 1న తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.