TV9 Telugu
ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. అనుష్క మూవీ టైటిల్ అదేనా..
17 Febraury 2024
ఎన్టీఆర్ హీరోగా చేస్తున్న దేవర సినిమా షూటింగ్ ఫిబ్రవరి లోపు అయిపోతుందని ముందు అనుకున్నా.. అది పూర్తి అవలేదు.
దేవర పార్ట్ 1 షూటింగ్ పూర్తవ్వడానికి మరో 4 నెలలు పట్టేలా ఉంది. దీంతో ఈ చిత్రాన్ని అక్టోబర్ 10కి వాయిదా వేశారు మేకర్స్.
దాంతో ఈ ప్రభావం బాలీవుడ్ చిత్రం వార్ 2పై పడుతుంది. దీంతో తారక్ వార్-2 సెట్స్‌లోకి ఇప్పట్లో రావడం కష్టమే.
అందుకే ఎన్టీఆర్ లేకుండానే ఈ చిత్ర షూటింగ్ మొదలు పెట్టాలని చూస్తున్నారు బాలీవుడ్ దర్శకుడు అయన్ ముఖర్జీ.
క్రిష్ జాగర్లమూడి, అనుష్క శెట్టి కాంబినేషన్‌లో ఓ సినిమా వస్తుంది. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
యూవీ క్రియేషన్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. తాజాగా ఈ సినిమా టైటిల్ గురించి ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది.
అనుష్క ప్రధాన పాత్రలో వస్తున్న ఈ సినిమాను కొన్ని వాస్తవిక సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు క్రిష్.
తనకు జరిగిన ఓ అన్యాయంపై ఓ ఒడిశా అమ్మాయి చేసిన పోరాటమే ఈ సినిమా కథ అని తెలుస్తుంది. దీనికి శీలవతి అనే టైటిల్ ప్రచారంలో ఉంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి