TV9 Telugu
తారక్ న్యూ లుక్.. ప్రేమలు తెలుగు ట్రైలర్..
04 March 2024
ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా కొరటాల శివ తెరకెక్కిస్తున్న సినిమా దేవర. తారక్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ మాస్ యాక్షన్ సినిమా ఇది.
దేవర కోసం ఎన్టీఆర్ అవుతున్న మేకోవర్ కూడా ఆసక్తికరంగా ఉంది. తాజాగా ఇప్పుడు మరో కొత్త తారక్ కనిపించారు.
బెంగళూరులో జరిగిన ఓ ప్రైవేట్ పార్టీకి వెళ్లారు ఎన్టీఆర్. అక్కడ ఆయన లుక్ చూసి అంతా ఫిదా అయిపోతున్నారు.
అందులో ప్రశాంత్ నీల్ టీంతో ఉన్నారు ఎన్టీఆర్. ప్రశాంత్ నీల్ తో ఓ సినిమా చేయనున్నారు ఎన్టీఆర్. వార్ 2 తర్వాత ఇది మొదలుకానుంది.
సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్, అఖిల భగవాన్ కీలక పాత్రల్లో నటించిన మలయాళీ రొమాంటిక్ కామెడీ సినిమా ప్రేమలు.
గిరీష్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. మళయాళీ ఇండస్ట్రీలో ఇప్పటికే బ్లాక్‌బస్టర్ అయింది ప్రేమలు మూవీ.
టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రేమలు సినిమాను స్టార్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తనయుడు కార్తికేయ విడుదల చేస్తున్నారు.
ఆసక్తిగా ఎదురు చూస్తున్న తెలుగు ట్రైలర్ మార్చి 2 సాయంత్రం 7 గంటలకి హైదరాబాద్ విజేత్ కాలేజీలో విడుదల చేసారు దర్శక నిర్మాతలు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి