టైగర్ నాగేశ్వరరావుపైనే టాలీవుడ్ ఆశలన్నీ..
19 October 2023
టైగర్ నాగేశ్వరరావుతో రవితేజపై పెద్ద బాధ్యతే ఉంది. ఈ సినిమా కోసం కేవలం రవితేజ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. మొత్తం తెలుగు ఇండస్ట్రీనే వేచి చూస్తుంది.
ఆయన సినిమా కోసం టాలీవుడ్ ఎందుకు వెయిట్ చేస్తుందబ్బా అనుకోవచ్చు. కానీ తెలుగు సినిమా ఏడాది భారాన్ని మోస్తున్నాడు టైగర్ నాగేశ్వరరావు. మరి ఏంటా భారం..?
దసరాకు విడుదలవుతున్న సినిమాల్లో భగవంత్ కేసరి కేవలం తెలుగు వరకే పరిమితం. లియో పాన్ ఇండియా అయినా హిందీలో మల్టీప్లెక్స్‌లో రిలీజ్ కావట్లేదు.
ఒక్క టైగర్ నాగేశ్వరరావు మాత్రమే ప్రాపర్ పాన్ ఇండియన్ రిలీజ్ అవుతుంది. రవితేజ కెరీర్‌లోనే హై బడ్జెట్ సినిమా ఇది.
ఏడాదిగా యశోద, లైగర్, శాకుంతలం, ఏజెంట్, స్పై, ఖుషీ, దసరా, విరూపాక్ష లాంటి చాలా సినిమాలు పాన్ ఇండియన్ వైడ్‌గా విడుదలయ్యాయి.
దసరా, విరూపాక్ష తెలుగులో హిట్టైనా.. మిగిలిన భాషల్లో వర్కవుట్ కాలేదు. దాంతో పాన్ ఇండియా కేవలం బిజినెస్ కోసమే వాడుకుంటున్నారనే విమర్శలు మొదలయ్యాయి.
టైగర్ నాగేశ్వరరావు కూడా పాన్ ఇండియన్ సినిమానే. అందుకే దీనిపై బాధ్యత ఎక్కువగా ఉందిప్పుడు. ఇది తెలుగులో హిట్టైతే సరిపోదు.
మిగిలిన భాషల్లో కూడా రప్ఫాడిస్తేనే అప్పుడు టాలీవుడ్‌లో పాన్ ఇండియన్ సినిమాలకు మళ్లీ మంచి రోజులొచ్చేది.
కార్తికేయ 2, కాశ్మీర్ ఫైల్స్‌తో అభిషేక్ అగర్వాల్ సంచలనం సృష్టించారు.. టైగర్ నాగేశ్వరరావుతోనూ ఇదే చేయాలని చూస్తున్నారీయన. చూడాలిక.. ఏం జరుగుతుందో..?
ఇక్కడ క్లిక్ చెయ్యండి