ఫ్రమ్ పాలిటిక్స్ టూ.. ఫిల్మ్..! ఖైదీ నెం 150తో దిమ్మతిరిగే రీఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరు.. ఆ తరువాత కెరీర్‌ను రోలర్ కోస్టర్ జర్నీగా కంటిన్యూ చేస్తున్నారు.
హిట్స్ అండ్ ఫ్లాప్స్‌తో.. అప్స్ అండ్ డౌన్స్ చూస్తున్నారు. అందులోనూ.. రీమేక్‌ల కారణంగా.. ఎక్కువ టార్గెట్ అయ్యారు మెగాస్టార్.
ఈ సారి రీమేక్ మాత్రమే కాదు.. రీమేక్ సీక్వెల్స్ లో నటిస్తారనే టాక్తో .. ఒకటి కాదు.. రెండు ఇండస్ట్రీల్లో హల్చల్ చేస్తున్నారు. మరో సారి అందరూ ఆయన వైపే చూసేలా చేసుకుంటున్నారు.
గతంలో మలయాళ ఫిల్మ్ లూసీఫర్ సినిమాను రిమేక్ చేసిన చిరు.. సూపర్ డూపర్ హిట్టు కొట్టారు. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్స్‌లో కనిపించి తన ఫ్యాన్స్కు పిచ్చెక్కించారు.
తన ఇంటెన్సివ్ యాక్టింగ్‌తో కేక పెట్టించారు. అయితే చిరుకు మంచి సక్సెస్ ఇచ్చిన లూసీఫర్‌కు తాజాగా మలయాళంలో సీక్వెల్ రెడీ అవుతోందట.
ఫస్ట్ పార్ట్‌కు డైరెక్టర్ అయిన హీరో పృథ్వీ డైరెక్షన్లోనే.. L2E ఎంపిరాన్ టైటిల్‌తో.. లూసిఫర్ సినిమా సీక్వెల్ షూటింగ్ తర్వలో మొదలుకానుందట.
అయితే లూసిఫర్ సీక్వెల్ కోసం హీరో మోహల్ లాల్ ఇప్పటికే కాస్త డిఫరెంట్ గా కనిపించేందుకు కసరత్తులు చేస్తున్నారట.
అయితే ఈ సినిమా సీక్వెల్ న్యూస్ అలా బయటికి వచ్చిందో లేదో.. ఇలా అందరూ మెగా స్టార్ వైపు చూడ్డం మొదలెట్టారు.
రీమేక్ ల జోలికి వెళ్లనంటూ.. ఇప్పటికే చిరు చెప్పిన క్రమంలో.. తనకు హిట్‌నిచ్చిన లూసీఫర్ సీక్వెల్‌ను.. చిరు చేస్తారా లేదా అని అందరూ చర్చించుకుంటున్నారట.
అయితే ఈ చర్చ ఒక్క టాలీవుడ్‌లోనే కాకుండా.. మల్లువుడ్‌లో కూడా.. మొదలవ్వడమే.. ఇక్కడ ... ఇంట్రెస్టింగ్ పాయింట్.