సినిమాల్లోకి రాకపోయి ఉంటే నిత్య మేనన్ ఏం చేసేదో తెలుసా?
22January 2025
Basha Shek
తెలుగుతో పాటు మలయాళం, తమిళం భాషల్లో హీరోయిన్ గా నటించిన నిత్య మేనన్‌కు అభిమానులు భారీగానే ఉన్నారు.
దీనికి కారణం ఆమె ఎంచుకున్న పాత్రలే. గ్లామర్ పాత్రలకు వీలైనంత వరకు దూరంగా ఉంటుంది. స్కిన్ షో కూడ చేయదు
సినిమాల్లో యాక్టింగ్ కు స్కోప్ ఉంటేనే అంగీకరిస్తుందీ అందాల తార. ఈ విషయాలే నిత్య మేనన్ కు క్రేజ్ ను తెచ్చిపెట్టాయి.
ఇటీవల జాతీయ ఉత్తమ నటి అవార్డు కూడా అందుకున్న ఈ మలయాళ భామ నటించిన తాజా చిత్రం కాదలిక్క నెరమిల్లై
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్న నిత్య మేనన్ తనకు నచ్చని రంగం సినిమా అని డైరెక్ట్‌గానే చెప్పేసింది.
ఇప్పుడైనా తనకు ఏదైనా రంగంలో అవకాశం వస్తే ఇప్పుడే సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోతానంటోంది నిత్య మేనన్
తనకు ప్రయాణం చేయడం అంటే చాలా ఇష్టమని అందుకే పైలెట్ కావాలని చిన్నప్పుడు కోరుకున్నానని గుర్తు చేసుకుంది నిత్య
కొన్ని నెలల క్రితం సైలెంట్ గా ఎక్కడికై నా వెళ్లిపోదామనుకున్నానని, అలాంటి సమయంలోనే జాతీయ ఉత్తమ నటి వచ్చిందంటోంది నిత్య.
ఇక్కడ క్లిక్ చేయండి..