పీరియడ్స్ వచ్చినా పట్టించుకోలేదు.. కానీ అతనొక్కడే..
16 January 2025
Basha Shek
తెలుగు సినిమా ఆడియెన్స్ లో ఇష్టమైన హీరోయిన్ ఎవరని అడిగితే చాలా మంది మలయాళ నటి నిత్యా మేనన్ పేరు చెబుతారు.
పేరుకు మలయాళ నటినే అయినా తెలుగు సినిమాలతోనే బోలెడు క్రేజ్, పాపులారిట తెచ్చుకుందీ అందాల తార.
ప్రస్తుతం తన రాబోయే సినిమా కాదలిక్క నేరమిల్లై ప్రమోషన్ కార్యక్రమంలో బిజీ బిజీగా ఉంటోంది నిత్యా మేనన్.
ఈ సందర్భంగా సినిమా ఇండస్ట్రీ గురించి నిత్య మేనన్ చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు తీవ్రసంచలనంగా మారుతున్నాయి.
ముఖ్యంగా నటీమణుల ఆరోగ్యం విషయంలో చిత్ర పరిశ్రమ కనీసపు మానవత్వం లేకుండా ప్రవర్తిస్తుందని వాపోయింది నిత్య.
నటీమణులు పీరియడ్స్ నొప్పితో ఉన్నామని చెప్పినా పట్టించుకోరని పని మాత్రమే పట్టించుకుంటారని ఈ నటి ఆవేదన వ్యక్తం చేసింది.
అయితే తన స్నేహితుడు, దర్శకుడు, నటుడు మిస్కిన్ ఒక్కడు మాత్రం ఇందుకు మినహాయింపు అని నిత్య చెప్పుకొచ్చింది.
మిస్కిన్ తనని బాగా అర్థం చేసుకున్నాడని, అందుకే అసౌకర్యానికి గురైన వెంటనే విశ్రాంతి తీసుకోవాలని తనతో చెప్పారంది నిత్య.
ఇక్కడ క్లిక్ చేయండి..