లాంగ్ గ్యాప్.. కలర్ ఫుల్ డ్రెస్‌లో కాక్ టైల్‌తో నిత్యా
TV9 Telugu
08 April 2024
న్యాచురల్ స్టార్ నాని నటించిన అలా మొదలైంది సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది మలయాళ నటి నిత్యామీనన్.
ఆ తర్వాత నితిన్ సరసన నటించిన ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే సినిమాలతో మంచి గుర్తింపు దక్కించుకుంది.
ఎన్టీఆర్ జనతా గ్యారేజ్, అల్లు అర్జున్ సన్నాఫ్ సత్యమూర్తి, 100 డేస్ ఆఫ్ లవ్, ఒక్క అమ్మాయి తప్ప, ఇంకొక్కడు తదితర సినిమాల్లో నటించంది.
ఆ మధ్యన సినిమాలతో పాటు కొన్ని తెలుగు, మలయాళం వెబ్ సిరీసుల్లోనూ నటించి మెప్పించిందీ ట్యాలెంటెడ్ యాక్ట్రెస్.
ఇదిలా ఉంటే సోమవారం (ఏప్రిల్ 08) నిత్యా మేనన్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఆమెకు బర్త్ డే విషెస్ చెప్పారు.
ఇదే సందర్భంగా నిత్యా మేనన్ నటిస్తోన్న కొత్త సినిమా నుంచి అప్ డేట్ వచ్చింది. ఆమె ప్రస్తుతం 'డియర్ ఎక్సెస్' సినిమాలో నటిస్తోంది.
ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్‌లో నిత్యా మేనన్ ఒక చేతిలో మొబైల్.. మరో చేతిలో కాక్ టైల్ గ్లాస్ పట్టుకుని కనిపించింది.
'డియర్ ఎక్సెస్' సినిమాలో వినయ్ రాయ్, నవదీప్, ప్రతీక్ బబ్బర్, దీపక్ పరంబోల్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
ఇక్కడ క్లిక్ చేయండి..