దిల్ మూవీ హీరోయిన్ నేహా గుర్తుందా.? ఇప్పుడెలా ఉందొ తెలుసా..

Anil Kumar

08 June 2024

యంగ్ హీరో నితిన్ నటించిన "దిల్" సినిమా యువతను ఆకట్టుకుంటూ ఎంతో పెద్ద సూపర్ హిట్ అయ్యిందో అందరికి తెలుసు.

అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన నేహా చాలామందికి గుర్తు ఉంటుంది.. అప్పట్లో యూత్ క్రష్ గా నిలిచింది.

టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి.. కొన్ని సినిమాల్లో నటించిన తరువాత పరిశ్రమకు దూరం అయింది అమ్మడు నేహా.

2003లో విడుదలై ఘన విజయం సాధించిన నితిన్ హీరోగా దిల్ చిత్రంలో హీరోయిన్ నందిని పాత్రలో కనిపించింది నేహా.

ఆ తర్వాత అతడే ఒక సైన్యం చిత్రంలో నటించింది. బొమ్మరిల్లు చిత్రంలో సుబ్బలక్ష్మి అనే పాత్రలో కనిపించింది.

తర్వాత రవితేజ దుబాయ్ శీను మూవీలో జేడీ చక్రవర్తి సరసన పూజాగా నటించింది. ఇక తర్వాత సినిమాలకు దూరమైంది.

2009 లో జీ టీవీలో ఓ సీరియల్లో నటించి మెప్పించిన ఈ అమ్మడు ఆ తర్వాత బుల్లితెరకు కూడా దూరమైంది నేహా.

తర్వాత వివాహం చేసుకుని, ఓ పాపకు జన్మనిచ్చింది నేహా. సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెడతారో లేదో చూడాలి.